ఫైర్‌ఫాక్స్ ఎంపికలు, అభిరుచులు, అమరికలు

ఫైర్‌ఫాక్స్ ఎంపికలుప్రాధాన్యతలు ప్యానెళ్ళు, వాటిలో ఉండే అమరికల రకాల గురించి ఈ వ్యాసం టూకీగా చెప్తుంది. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి. ఈ క్రింది ప్యానెళ్ళు అందుబాటులో ఉన్నాయి:

సాధారణ ప్యానెలు

ఈ ప్యానెలులో ఈ క్రింది రకాల అమరికలకు ఎంపికలుఅభిరుచులు ఉంటాయి:

సాధారణం
మొదలుపెట్టడం,, ముంగిలి పేజీ మరియు ట్యాబులు: ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్‌ను మీ అప్రమేయ విహారిణిగా అమర్చుకోవచ్చు, ఫైర్‌ఫాక్స్ ఆరంభమైనపుడు ఏయే పేజీలను తెరవాలి అనేది మార్చుకోవచ్చు, ఫైర్‌ఫాక్స్ ఆరంభమైనపుడు మీ మునుపటి సెషన్ను యధాస్థితికి తెచ్చునట్టు అమర్చుకోవచ్చు మరియు ట్యాబులు ఎలా తెరవాలో ఎంచుకోవచ్చు.

భాష, రూపురేఖలు
ఫాంట్లు & రంగులు మరియు భాష: ఇక్కడ మీరు వెబ్సైట్లు వాడే ఫాంట్లు, రంగులను మార్చవచ్చు, ఒక ప్రాధాన్య చూపు భాషను ఎంచుకోవచ్చు మరియు ఫైర్‌ఫాక్స్ అక్షర కూర్పును వాడవచ్చు.

దస్త్రాలు, అనువర్తనాలు
దింపుకోళ్ళు, అనువర్తనాలు మరియు డిజిటల్ హక్కుల నిర్వహణ (DRM) కంటెంట్: ఇక్కడ మీరు దస్త్రాలను దాచడం కోసం ఫైర్‌ఫాక్స్ వాడే దింపుకోలు ఫోల్డరును మార్చుట, వివిధ రకాల దస్త్రాలకు ఉపయోగించిన అనువర్తనము లేదా చేసిన క్రియను మార్చుట మరియు DRM కంటెంటును ఫైర్‌ఫాక్స్‌లో చూచుట చేయొచ్చా అనేది ఎంపిక చేసుకొనవచ్చు.

ఫైర్‌ఫాక్స్ తాజాకరణలు
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ యొక్క తాజాకరణ చరిత్రను పరీక్షించవచ్చు లేదా తాజాకరణ అమరికలను మార్చవచ్చు.

పనితనం
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ యొక్క పనితనం అమరికలు మార్చవచ్చు.

విహరణ
ఇక్కడ మీరు స్క్రోలింగ్ అమరికలను ఎంచుకోవడం, కర్సర్‌ని (కేరెట్ విహరణ రీతిలో) ఉపయోగించడం లేదా వెబ్ పేజీల్లో పాఠ్యాన్ని వెదకడం చేయవచ్చు.

నెట్‌వర్క్ ప్రాక్సీనెట్‌వర్క్ అమరికలు
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ కనెక్షన్ అమరికలు మార్చవచ్చు మరియు జాలకు కలయిక కోసం ఒక ప్రాక్సీని అమర్చుకొనవచ్చు.

ముంగిలి ప్యానెలు

ఈ ప్యానెలు ఈ క్రింది రకాల అమరికలకు ఎంపికలుఅభిరుచులు కలిగి ఉంది.

కొత్త విండోలు, ట్యాబులు
ఈ అమరికలు మీరు ముంగిలి పేజీ, ఒక కొత్త ఫైర్‌ఫాక్స్ విండో లేదా ఒక కొత్త ట్యాబ్ తెరచినప్పుడు ఏమి చూడాలో అనేది ఎంపిక చేసుకోనిస్తాయి. మీరు మీ ముంగిలి పేజీని అప్రమేయ ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ, ఒక ఖాళీ పేజీ లేదా ఒక ఎంచుకున్న URLకు అమర్చుకొనవచ్చు; కొత్త ట్యాబులు అప్రమేయ ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీని లేదా ఒక ఖాళీ పేజీని తెరచునట్టు అమర్చుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ ముంగిలి కంటెంట్
ఈ అమరికలు; వెబ్ శోధన, ఉత్తమ సైట్లు, పాకెట్‌చే సిఫారసు చేయబడినవి, మొజిల్లా స్నిప్పెట్స్ మరియు ప్రముఖ విషయాలతో సహా అప్రమేయ ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ లేదా కొత్త ట్యాబ్ పేజీ స్వరూపాలను దాచుట లేదా చూపించుటకు అనుమతిస్తాయి. ఈ లక్షణాల గురించి మరింత సమాచారం కోసం క్రొత్త ట్యాబ్లో టైల్స్ గురించి మరియు Customize your Firefox New Tab page చూడండి.

వెతుకుడు ప్యానెలు

ఈ ప్యానెలు ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా వాడే వెతుకుడు యంత్రం ఎంపికలుఅభిరుచులు మరియు ఇతర వెతుకుడు అమరికలను కలిగిఉంటుంది. మరింత సమాచారం కోసం Firefox లో మీ డిఫాల్ట్ శోధన సెట్టింగ్లను మార్చండి చూడండి.

అంతరంగికత & భద్రత ప్యానెలు

ఈ ప్యానెలులో ఈ క్రింది రకాల అమరికలకు ఎంపికలుఅభిరుచులు ఉంటాయి:

"విహారిణి గోప్యత"
కంటెంటును అడ్డగించుట,కుకీలు, సైటు సమాచారం,ఫారంలు & పాస్‌వర్డులు, చరిత్ర, చిరునామా బార్ఫారంలు & పాస్‌వర్డులు, చరిత్ర, కుకీలు, సైటు సమాచారం, చిరునామా బార్ మరియు ట్రాకింగ్ భద్రత: ఇక్కడ మీరు ఈ ఫైర్‌ఫాక్స్ అమరికలను నియంత్రించవచ్చు - ట్రాకింగ్ భద్రతకంటెంటును అడ్డగించుట మరియు ట్రాక్ చేయవద్దు లక్షణాలు, వెబ్‌సైటు కుకీలు, వెబ్‌సైటు డేటా నిల్వ మరియు తాత్కాలికంగా నిల్వ చేయబడిన వెబ్ కంటెంటు నిర్వహణ, ఫారంలు నింపుట మరియు సంకేతపు మాటల నిర్వహణ అమర్చుట, మీ విహరణ, దింపుకోలు, శోధన, ఫారం చరిత్ర నిర్వహణ మరియు చిరునామా బార్ ఎలా పనిచేస్తుంది అమర్చుట.

అనుమతులు
ఇక్కడ మీరు వెబ్సైట్లు మీకు వెబ్ పుష్ ప్రకటనలు పంపించవచ్చా, పాప్ అప్ విండోలు చూపించవచ్చా మరియు వెబ్సైట్లు పొడిగింపులు స్థాపించుకోవడం చేయొచ్చా అనేది నిర్ణయించుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ డేటా సేకరణ, వాడుక
ఇక్కడ మీరు ఫైర్‌ఫాక్స్ మొజిల్లాకు సాంకేతిక మరియు పారస్పరిక సమాచారం పంపించు, స్టడీస్‌ని స్థాపించి నడుపు లేదా మొజిల్లాకు క్రాష్ నివేదికలు పంపడం అనేవి నిర్ణయించుకోవచ్చు.

భద్రత
మోసపూరిత కంటెంట్ మరియు ప్రమాదకర సాఫ్ట్‌వేర్ రక్షణ మరియు సర్టిఫికెట్లు: ఇక్కడ మీరు వెబ్సైటు సర్టిఫికెట్లు మరియు భద్రతా పరికరాలు చూడడం మరియు నిర్వహించడం చేయవచ్చు మరియు మీరు ఫైర్‌ఫాక్స్‌లో ప్రమాదకర కంటెంట్ లేదా దింపుకోళ్లను అడ్డగించుట చేయవచ్చు.

ఫైర్‌ఫాక్స్ ఖాతా ప్యానెలు

ఈ ప్యానెలు మిమ్మల్ని ఒక ఫైర్‌ఫాక్స్ ఖాతాను అమర్చుకొనుట లేదా నిర్వహించడం చేయనిస్తుంది, ఇది సింక్ వంటి నిశ్చిత మొజిల్లా సేవలను వాడుకొనుటకు అవసరం. మరింత సమాచారం కోసం నేను నా కంప్యూటర్లో సింక్ ఎలా సెటప్ చేయాలి మరియు How do I choose what information to sync on Firefox? చూడండి.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి